పరిచయం

Oxford Global Languages కార్యక్రమం అంటే ఏమిటి?
Oxford Global Languages (OGL) అనేది OUP నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 భాషల కొరకు లెక్సోగ్రాఫికల్ వనరులను రూపొందించడం మరియు అవి ఆన్‌లైన్‌లో లభ్యం అయ్యేలా చూడటం కోసం వేసిన ఒక గొప్ప ముందడుగు. మొదటిసారిగా, స్పీకర్‌లు, అభ్యాసకులు మరియు డెవలపర్‌ల కోసం విస్తృతమైన పరిధిలో వివిధ భాషల కొరకు భారీ మొత్తంలో నాణ్యమైన లెక్సికల్ సమాచారాన్ని ఒకే లింక్ రిపొజిటరీని క్రమబద్ధంగా సృష్టించబడుతుంది, సేకరించబడుతుంది మరియు అందుబాటులోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే మిలియన్‌ల కొద్దీ ప్రజల కోసం వారి భాషలోని కంటెంట్‌ని వెబ్‌సైట్‌లలో, యాప్‌లలో మరియు అనేక ఇతర సాధనాలు మరియు సేవలలో డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారి అనుభవంలో పరివర్తన తీసుకొని రావాలనేదే కార్యక్రమ లక్ష్యం.  
OGL ప్రేరణ కార్యక్రమం అనేది:

•ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న భాషలను వాటిలోని వైవిధ్యాలు మరియు యాసలతో పాటు నిజంగా అవి ఎలా ఉపయోగించబడుతున్నాయి అన్న కంటెంట్ రూపొందిస్తుంది
•యాక్సెస్ చేసుకోగల, లింక్ చేయగల మరియు తిరిగి ఉపయోగించగల భాషా డేటా యొక్క విస్తృతమైన డేటా స్టోరును రూపొందించడం ద్వారా భాషా వనరులను అంతర్జాతీయంగా యాక్సెస్ చేసుకునేలా అందుబాటులో ఉంచుతుంది
•ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషలను పునరుద్ధరించి, మద్దతివ్వడం కోసం కొత్త డిజిటల్ సాధనాలు మరియు వనరులను మెరుగుపరుస్తుంది
•ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషల గురించి అవగాహన మరియు సామాజిక భావనను పెంపొందించడం
కార్యక్రమంలో ఏ భాషలు చేర్చబడతాయి?
మొత్తం మీద కనీసం 100 భాషలు కలిగి ఉండాలని OGL లక్ష్యంగా పెట్టుకుంది అయితే దీనిని సాధించడానికి అనేక సంవత్సరాలు పడుతుందని మాకు తెలుసు. మేము ముందుగా అత్యంత భిన్నమైన ప్రాంతాలకు చెందిన పది భాషలతో దీనిని ప్రారంభించాము, ప్రతిదీ కూడా డిజిటల్ రంగంలో రకరకాల స్థాయిలలో ఉనికిని చాటుకుంటూ ఉంది, వీటి ద్వారా మేము OGL నియమాలను వివరిస్తూ, మాకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలనుకున్నాము. కాలక్రమంలో మేము నెమ్మదిగా మరిన్ని భాషలను జోడిస్తాము, అంతర్జాతీయమైనవి మరియు డిజిటల్ రంగం అంతగా ప్రాధాన్యత లేనివి రెండూ పరిగణనలోకి తీసుకుంటాము.
Oxford Global Languages కార్యక్రమం 2015లో తన మొదటి రెండు భాషా సైట్‌లు ఇసిజులు మరియు నార్తర్న్ సోతోని ప్రారంభించింది, మొదటి సంవత్సరంలో 10 భాషలు చేర్చబడ్డాయి, తరువాత కొన్ని సంవత్సరాల్లో మరిన్ని జోడించబడ్డాయి.



మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
సామాజిక చొరవ
తాజాగా ఉండే నిఘంటువులను రూపొందించడం కోసం మేము స్థానిక భాషా సంఘాలతో కలిసి పని చేస్తున్నాము. వినియోగదారులు తమ భాషకు మద్దతుగా ఉండి, వనరులను రూపొందిస్తున్న భావనను కల్పించడమే మా లక్ష్యం.
సృజనాత్మకత
OGLలో OUP యొక్క డిజిటల్ ఆవిష్కరణలు మరియు మా అంతర్జాతీయ నిఘంటువుల కార్యక్రమంలో ఉండే విస్తృతమైన చేరువ మరియు పరిమాణం రెండూ ఉంటాయి.
మిషన్
OUP మిషన్ అన్నది Oxford విశ్వవిద్యాలయంలోని ఒక విభాగం, ఇది తన అద్భుతమైన ప్రచురణా నైపుణ్యాలతో పరిజ్ఞానాన్ని మరియు అభ్యసనా సామర్థ్యాన్ని పెంపొందిస్తోంది.
గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని లెక్సికల్ డేటాకు మాతృక 2015లో Oxford University Press ద్వారా ప్రచురించబడ్డ Oxford తెలుగు-ఇంగ్లిష్ నిఘంటువు © Oxford విశ్వవిద్యాలయం ప్రెస్ 2015.
ఇప్పటికే ప్రారంభించబడ్డ భాషలను పరిశీలించి, మీ భాషను ట్రాక్ చేయండి