Oxford Global Languages FAQలు


Oxford Global Languages (OGL) యొక్క లక్ష్యాలు ఏమిటి?
100కు పైగా భాషల కొరకు కంటెంట్‌ని ఆన్‌లైన్‌లో ఉంచడం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు మరియు డెవలపర్‌ల కొరకు కంటెంట్ లభ్యం అయ్యేలా చేయడమే కార్యక్రమం యొక్క మొత్తం లక్ష్యం. దీనిని చేయడానికి, భద్రపరచగల, లింక్ చేయగల, మరియు బహుళ విధానాల్లో యాక్సెస్ చేసుకోగల భాష మరియు డిక్షనరీ కంటెంట్‌ని టీమ్ సృష్టించాల్సి ఉంటుంది. OGL ప్రోత్సాహం డిజిటల్‌గా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న భాషలు అదేవిధంగా ప్రపంచంలోని ప్రధాన భాషలకు మద్దతు ఇవ్వడానికి కొత్త డిజిటల్ టూల్స్ మరియు వనరులు అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుంది. ఇది డిజిటల్ ముఖచిత్రంలో ఈ భాషలకు ఒక సజీవమైన, ఎదుగుదల, ప్రకాశవంతమైన ఉనికిని అందిస్తుంది, మరియు వాటి వేరియంట్‌లు మరియు యాసలతో సహా వాటిని డాక్యుమెంట్ చేయడానికి సహాయపడుతుంది.

ఏ భాషలను ప్రారంభించాలో మీరు ఎంచుకుంటారు?
మొత్తం మీద కనీసం 100 భాషలు కలిగి ఉండాలని OGL లక్ష్యంగా పెట్టుకుంది అయితే దీనిని సాధించడానికి అనేకసంవత్సరాలు పడుతుందని మాకు తెలుసు. OGL  సూత్రాలు మరియు మేం ముందుకు సాగేటప్పుడు మా అంచనాలకు సవాళ్లను ప్రదర్శించడానికి, ప్రతిదీ కూడా విభిన్న డిజిటల్ ఉనికి యొక్క స్థాయిలతో ఉన్న, వివిధ ప్రాంతాలకు చెందిన పది విభిన్న భాషలతో మేం ప్రారంభించాం. కార్యక్రమం అభివృద్ధి చెందుతున్న కొలదీ, మేం విస్త్రృత శ్రేణి అంతర్జాతీయ మరియు డిజిటల్‌గా ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న భాషలను కవర్ చేయడానికి విస్తరిస్తాం.

కార్యక్రమంలో ఏ భాషలు చేర్చబడ్డాయి? మరియు ఏ భాషలు రాబోతున్నాయని నేను ఎక్కడ కనుగొనగలను?
మీరు ఇక్కడమేం ఏ భాషలను లాంఛ్ చేశామో ట్రాక్ చేయవచ్చు మరియు కార్యక్రమానికి ఏ భాషలు జోడించబడ్డాయో తెలుసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు  ఇక్కడ మాకు టచ్‌లో ఉండటం ద్వారా Oxford Global Languages న్యూస్ లెటర్‌కు సైన్ అప్ చేయగలరు.

మీరు కార్యక్రమం గురించి స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తారా?
అవును, అయితే ఏదైనా ప్రస్తుత అస్థిత్వానికి అఫిలియేట్ లేదా భాగం కాలేదు. OGL అనేది ఒక సరికొత్త మరియు పూర్తిగా స్వతంత్ర ప్రోత్సాహం ఇది ప్రపంచవ్యాప్తంగా అభ్యసన మరియు పాండిత్యాన్ని వ్యాప్తి చేయాలనే Oxford యూనివర్సిటీ యొక్క భాగమైన Oxford University Press (OUP) ద్వారా మద్దతు ఇవ్వబడుతోంది. అయితే, మేం OGL యొక్క లక్ష్యాల్లో ఆసక్తిని పంచుకునే లేదా ఆసక్తి కలిగిన ఏదైనా సంస్థతో భాగస్వామ్యంతో పనిచేయడానికి మేం ఆసక్తిగా ఉన్నాం, కార్యక్రమం అభివృద్ధి చెందడం కొనసాగుతున్న కొలదీ, ప్రభుత్వ సంస్థలు, విద్యావేత్తలు, యూనివర్సిటీలు, దాతృత్వ సంస్థలు, మరియు కంపెనీలతో అనుసంధానం కావాలని మేం కోరుకుంటాం.  మేం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భాగస్వాములు, విద్యావేత్తలు, మరియు భాషా నిపుణులతో కొన్నిగొప్ప సంబంధాలను ఏర్పరుచుకున్నాం. ఒకవేళ మీకు కార్యక్రమంలో భాగం కావాలనే ఆసక్తి ఉన్నట్లయితే, దయచేసి ఇక్కడ మమ్మల్ని సంప్రదించండి.

ప్రతి భాషా సైట్‌లకు ఎక్కడ నుంచి కంటెంట్ వస్తుంది?
మా కంటెంట్ నిజమైన భాష, నిజమైన వినియోగం, మరియు నిజమైన వినియోగదారుల ఆధారితమైనది. OGL కార్యక్రమంలోని కొన్ని భాషల కొరకు, నవీకరించబడ్డ తాజా డిక్షనరీలు లభ్యం కావడం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మా ప్రారంభ బిందువుగా మేం ఇప్పటికే ఉన్న డిక్షనరీని ఉపయోగిస్తాం, ఇతర సందర్భాల్లో భాషా వినియోగం యొక్క ముడి సమాచారంతో కలిపి అర్ధం యొక్క ప్రేమ్‌వర్క్‌తో ప్రారంభించాల్సి ఉంటుంది-  కార్పోరా– దీని ద్వారా అన్నివిధాలైన భాషా సమాచారాన్ని మేం స్వయంచాలితంగా సేకరిస్తాం.  ఇది కొత్త కంటెంట్ సృష్టించడానికి మా లెక్సికోగ్రాఫర్‌లకు ఒక ఆధారాన్ని ఇస్తుంది. మేం మిమ్మల్ని, వినియోగదారులు నిమగ్నం అయ్యేందుకు కూడా ఆహ్వానిస్తాం, ఉదాహరణకు మీ భాషకు సంబంధించిన అనువాదాలు మరియు ఇతర సమాచారాన్ని అందించడం ద్వారా.  ప్రతి భాష కొరకు లభ్యం అవుతున్న సమాచారాన్ని విస్తరించడానికి ఈ వినియోగదారు రూపొందించిన కంటెంట్ తరువాత ఎడిటోరియల్ వర్క్‌కు సమాచారం అందిస్తుంది.

వినియోగదారు రూపొందించిన కంటెంట్ ‘సంప్రదాయ’ భాషను వక్రీకరిస్తుందా?
భాషా సమస్యల గురించి ప్రజలు మాట్లాడతారు ఎందుకంటే వారు మాట్లాడే భాష గురించి ప్రజలు ఉద్రేకంగా ఉంటారు. భాష గురించి కేవలం ‘నిపుణుల’కు మాత్రమే తెలుసు అని కొంత మంది వ్యక్తులు భావిస్తారు మరియు యాస లేదా వ్యవహారిక వినియోగం కొంత మేరకు ‘తప్పు’ అని మరియు నిఘంటువులో స్థానం లేదని భావిస్తారు. సంప్రదాయ మరియ సంప్రదాయేతర, భాష యొక్క అన్ని రూపాలు కూడా ముఖ్యమైనవి అని మరియు మాతృభాషీయులకు ఇప్పటికే వారి స్వంత భాష గురించి చాలా తెలుసు అని మేం విశ్వసిస్తాం. ఒక భాష దాని వినియోగదారుల ద్వారా ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించడమే OGL కార్యక్రమం ద్వారా మా లక్ష్యం – తద్వారా మేం చేసేది ప్రతిఒక్కరికి సంబంధితంగా ఉంటుంది.

కొన్ని భాషలకు ఇతరవాటికంటే విస్త్రృతమైన కవరేజీ ఉంటుంది. ఇది ఎందుకు?
నెమ్మదిగా ప్రారంభించడం, మరియు రూపకల్పన చేయడం అనేది కార్యక్రమం యొక్క సూత్రాల్లో ఒకటి. అందువల్ల ఒక భాష కొరకు చిన్న మొత్తంలో కంటెంట్ మాత్రమే లభ్యమైనప్పటికీ, వినియోగదారులు కంటెంట్ ఉపయోగించడం ప్రారంభించడం మరియు మాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం కొరకు కార్యక్రమంలో దానిని మేం చేర్చగలుగుతాం. కార్యక్రమం అభివృద్ధి చెందుతున్న కొలదీ, కంటెంట్ కూడా పెరుగుతుంది.

నా డిక్షనరీ లేదా నా కంటెంట్‌ని OGL కార్యక్రమానికి నేను ఎలా జోడించగలను?
అయితే మేం ప్రతిదీ చేర్చలేం అయితే కొన్ని భాషలకు మాకు ఇప్పటికే ఎలాంటి కంటెంట్ లభ్యం కావడం లేదు. ఒకవేళ మీరు, మీ యూనివర్సిటీ, లేదా మీ ఆర్గనైజేషన్ కార్యక్రమం గురించి ఆసక్తి ఉన్నట్లయితే, లేదా OGL ఏ దిశలో సాగాలనే దానిపై సూచనలు ఉన్నట్లయితే, దయచేసి  మమ్మల్ని సంప్రదించండి.

ప్రపంచవ్యాప్తంగా భాషలను అభివృద్ధి చేయడంలో OUP యొక్క పాత్ర ఏమిటి?
OUP యూనివర్సిటీ ఆఫ్ Oxford యొక్క డిపార్ట్‌మెంట్ మరియు నాలెడ్జ్ మరియు అభ్యసనను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించాలనే యూనివర్సిటీ మిషన్‌ని ఇది పంచుకుంటుంది. ఇది ప్రత్యేక వనరులు, నైపుణ్యాలు మరియు నాలెడ్జ్ కలిగిన మరియు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే అత్యధిక నాణ్యత కలిగిన ఎడ్యుకేషన్ మెటీరియల్స్ అందించడంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన అంతర్జాతీయ పబ్లిషింగ్ సంస్థ. మేం తమ భాషకు నిర్ధిష్టమైన కంటెంట్‌ని అభివృద్ధి చేయడంలో తమ భాషా సమాజంలో భాగంగా ఉన్న స్థానిక భాషా నిపుణులతో మేం కలిసి పనిచేస్తాం. ఇది మా మిషన్‌లో భాగం: విస్త్రృత సమాజ ప్రయోజనం కొరకు మా వనరులను పంచుకోవడం.

స్థానిక భాషా సమాజాల యొక్క నిమగ్నత ఎంత ఉంటుంది?
కమ్యూనిటీ నిమగ్నత అత్యావశ్యకం. కంటెంట్ సూచించడం లేదా మా వనరులను యాక్సెస్ చేసుకునేలా, స్థానిక భాషా సమాజాలు కార్యక్రమంలో నిమగ్నం కావాలని మేం కోరుకుంటాం. కార్యక్రమం అభివృద్ధి చెందిన కొలదీ భాషా సమాజాలు తమ భాషలో కంటెంట్ రూపొందించడం మరియు ఉపయోగించుకునేందుకు కొత్త ప్రోత్సాహాలు అనుమతిస్తాయి.

ఏదిOGL ని వైవిధ్యంగా చేస్తుంది?
చాలా కార్యక్రమాలు ఉచిత భాషా సైట్‌లు అందించడం లేదా భాషా వనరులను సేకరించే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి, కానీ కొన్ని కార్యక్రమాలు మాత్రమే OGLకు మద్దతు ఇచ్చే బలమైన లెక్సికోగ్రాఫికల్ సూత్రాలతో అనేక భాషల కొరకు విస్త్రృతమైన మరియు లోతైన భాషా వనరులను సృష్టించగలుగుతుంది. భాషలను సజీవంగా మరియు ప్రతిస్పందించేవిధంగా ఉంచడం కొరకు కంటెంట్ వాస్తవ వినియోగంపై ఆధారపడి ఉంటుంది మరియు అప్‌టూ డేట్‌గా ఉంచబడుతుంది మరియు దీర్ఘకాలం నిర్వహించబడుతుంది. కారణం మా మిషన్‌లోనే ఉంది- తక్షణ ప్రయోజనం కొరకు కాకుండా ప్రపంచవ్యాప్తంగా భాషల యొక్క దీర్ఘకాలిక ప్రయోజనం కొరకు మేం రూపొందిస్తున్నాం.

Is OGL కంటెంట్ ఉచితమా?
OGL వెబ్‌సైట్‌లు అన్నీ కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.  మీరు పదాలు, అనువాదాలు, మరియు ఇతర భాషా సమాచారం కొరకు చూడవచ్చు. సైట్‌లు సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉపయోగించుకోవడం కొరకు ఎల్లప్పుడూ మూలభాషలో అందించబడతాయి మరియు కొన్నిసార్లు ఇంగ్లిష్‌లో కూడా అందించబడతాయి.
OGL ని వెబ్‌సైట్‌లపై లాంఛ్ చేయడంతోపాటుగా, మేం వాటిని Oxford Dictionaries API కార్యక్రమంలో కూడా చేర్చాం. ఒకవేళ మీరు మీ అప్లికేషన్‌లో భాషా డేటాను ఉపయోగించేందుకు ఆసక్తి కలిగిన డెవపలర్ అయితే, ప్రైవేట్ వినియోగం మరియు పరిమిత వినియోగం కొరకు OGL కంటెంట్‌ని ఉపయోగించుకోవచ్చు, మరియు APIలను మరింత విస్త్రృతంగా ఉపయోగించడం కొనసాగించాలని కోరుకున్నట్లయితే మా నెలవారీ ప్లాన్‌లకు చందాదారులు కావొచ్చు. మరిన్ని వివరాల కొరకు దయచేసి మా API పేజీ ని సందర్శించండి లేదా మరిన్ని వివరాల కొరకు మాతో  ఇక్కడ టచ్‌లో ఉండండి.

OGL ప్రాజెక్ట్‌తో నిమగ్నం కావడం గురించి నేను ఎక్కడ కనుగొనగలను?
మేం మీ నుంచి వినాలని అనుకుంటున్నాం, అందువల్ల వీటి కొరకు మాతో టచ్‌తో ఉండండి:
•కార్యక్రమం గురించి మరింత తెలుసుకోవాలని మీరు కోరుకున్నప్పుడు
•మీరు లేదా మీ ఆర్గనైజేషన్ OGL యొక్క లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడేందుకు Oxford Dictionariesకు సహకారం అందించాలని భావించినట్లయితే
•OGL న్యూస్‌లెటర్‌కు సైన్ అప్ చేయడం ద్వారా మీరు టచ్‌లో ఉండవచ్చు
ఇక్కడమాతో టచ్‌లో ఉండండి.